About Scenes -1 :
Apr
25
Posted by kinosappi.blogspot.in
Every Scene you write must be an obvious
Situation .
స్క్రిప్ట్ లో రాసే ప్రతీ సీన్ ఒక
తప్పనిసరిగా వచ్చే పరిస్తితిలా వుంటే
సినిమా బాగావస్తుంది. అప్పుడు స్క్రిప్ట్ లో వచ్చే ప్రతీ సీన్ అద్భుతం గా వుంటుంది
. ఏ సీన్ ని తీసివేయడానికి కుదరకుండా వుంటుందో అదే బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది
.అలా స్క్రిప్ట్ వుండాలంటే క్రియేట్ చేసే
సిట్యువేషన్ బాగుండాలి .బలం గా వుండాలి .
ఉదాహరణ : 3 ఇడియట్స్ లో క్లైమాక్స్ (డెలివరీ
సీన్)
అమీర్ఖాన్ (రాంచో ) ఒక మెకానికల్ ఇంజనీరింగ్
ఫైనల్ ఇయర్ లో వున్నాడు . అతని స్కిల్ బయటపడాలంటే
ఒక హార్డ్ సీటువేషన్ వుండాలి .రాంచో మేధావితనం ,తెలివితేటలు అంతా బయటపడాలి .లాజిక్ మిస్ అవ్వకూడదు . అందుకే ఇంజినీర్ అయిన
రాంచో కి పూర్తి గా వ్యతిరేకమైన మెడికల్ సిట్యువేషన్ క్రియేట్ చేశారు . ఇది వెరీ
హార్డ్ సిట్యువేషన్...
---కరీనా కపూర్ (ప్రియా) మెడికల్ స్టూడెంట్
అండ్ డాక్టర్ . తాను వస్తే డెలివేరి చేస్తుంది . అందుకే కరీనా కపూర్ ని హాస్పిటల్
లోకి వెళ్ళేలా చేశారు . వర్షం కురవడం ,వరద రావడం
వలన ప్రొఫెసర్ కూతురుని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం కుదరదు . అందుకే లాస్ట్ సీన్ లలో
వర్షం ని వాడుతూ వున్నారు ...ఇక్కడ లాజిక్ వుండాలి . అందుకే ఇలా ప్లాన్ చేశారు .
--- రాంచో అతని టీం ఈ డెలివరీ సమస్యని
హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు . మొదట పవర్ వచ్చేలా చేస్తారు . తర్వాత
ఇంటర్నెట్ ద్వారా కరీనా కపూర్ (ప్రియా ) తో మాట్లాడతారు . వాక్యుమ్ క్లీనర్ ద్వారా
ప్రెషర్ క్రియేట్ చేసి డెలివరీ చేస్తారు ...
--- అంతకుముందు సీన్ లో ప్రొఫెసర్ సహస్ర
బుద్ధి (బొమన్ ఇరానీ ) రాంచో ని కొడతాడు . ఈ సీన్ ద్వారా పూర్తిగా మారిపోవాలి
.రాంచో ని బెస్ట్ స్టూడెంట్ గా ఒప్పుకోవాలి ..అదే ఈ సీన్ లో జరుగుతుంది .రాంచో
ప్రాక్టికల్ నాలెడ్జి చూసి షాక్ తిని , కూతురుకి
పుట్టిన కొడుకు ని చేతుల్లోకి టేసుకోగానే అతని అహం ,సూపర్
ఇగో అంతా ఎగిరిపోతుంది . అందుకే తన పెన్ ఇస్తాడు .
ఇదంతా జరగడానికి సీటువేషన్ కారణం . దీన్ని
సరిగ్గా అల్లుకుంటే చాలు . సినిమా నిలబడుతుంది . ఈ సీన్ లో ఒమి వైద్య (చతుర్ )
వుండడు . వుంటే రాంచో మేధావి తనానికి మారిపోతాడు .. అందుకే వుంచలేదు ....( చాలా
గొప్ప సీన్ –అందించిన “ రాజ్కుమార్ హీరాణి కి ..అభిజిత్ జోషి కి థాంక్స్ వన్స్
అగైన్ )
0 comments:
Post a Comment