About Movie Success -1:

About Movie Success -1:
Nothing  will work if you don’t have
1.Interesting Character
2.Good story to tell .

 ఉదాహరణ :
n  కిక్ సినిమా లో ఇంటరెస్టింగ్ క్యారక్టర్  వుంది కాబట్టే  సినిమా అంతగా వర్కౌట్ అయ్యింది .


n  3 ఇడియట్స్ సినిమా ..పికే  సినిమా లలో ఏమి వుంది ? ఇంటరెస్టింగ్ క్యారక్టర్  వుంది...కాబట్టి అవి బ్లాక్ బస్టర్ లు అయ్యాయి ...
                                                        


n  మున్నభాయి సీరీస్ సినిమాల లో ఇంటరెస్టింగ్ క్యారక్టర్  హీరో ది కాబట్టే సినిమా లు నిలబడ్డాయి .


-------------------------------------------------------------


  గజిని సినిమా  లో  ఇంటరెస్టింగ్ స్టోరీ వుంది కాబట్టే  సినిమా కోట్లు కొల్లగొట్టింది .





n  లగాన్ , రంగ్డే బసన్తి ,కహానీ ,సత్యా ,కంపెనీ , చక్ డే ఇండియా  ఇలా హిట్ అయిన ప్రతీ సినిమా లో మంచి స్టోరీ తప్పక వుంటుంది ...



About Conflict Generation :


Knowing Your character’s  point of view becomes a good way to generate conflict




ఉదాహరణ : 3 ఇడియట్స్  లో కాన్ఫ్లిక్ట్

          రాంచో పాయింట్ ఒఫ్  వ్యూ 

ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి పాయింట్ ఒఫ్ వ్యూ   


--3 ఇడియట్స్ లో రాంచో ( అమీర్ ఖాన్ ) కి ఒక పాయింట్ ఒఫ్ వ్యూ వుంటుంది . అది ఏమిటంటే “ చదువు వుద్యోగం కోసం కాదు . అంతకుమించి చదువు మనకు నేర్పాలి .నేర్చుకోవాలి . కొత్త ఆవిష్కరణల కోసం .” అని  రాంచో మాట్లాడుతూ వుంటాడు .
అయితే  రాంచో కి పూర్తి వ్యతిరేఖమైన పాయింట్ ఒఫ్ వ్యూ  ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి ది ...


--- ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి పాయింట్ ఒఫ్ వ్యూ   ఏమిటంటే “బాగా చదవండి . బాగా మార్క్స్ తెచ్చుకోండి . ప్రెషర్ ఫీల్ అవ్వండి . క్యాంపస్ ఇంటర్వ్యూ లో జోబ్స్ కొట్టండి “ ఇలా ఆలోచిస్తుంటాడు ...


3 ఇడియట్స్ లో జోయ్ ఆత్మహత్య తర్వాత రాంచో  వేసిన ప్రశ్న కు ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి కి మధ్య కాన్ఫ్లిక్ట్  మొదలు అవుతుంది . ఆ  కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ వెళ్తుంది . అది చివరి లో ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి కి మనవడు పుట్టడం తో తీరిపోతుంది .


                               

About Scenes -1 :




 Every Scene you write must be an obvious Situation .
స్క్రిప్ట్ లో రాసే ప్రతీ సీన్ ఒక తప్పనిసరిగా వచ్చే పరిస్తితిలా  వుంటే సినిమా బాగావస్తుంది. అప్పుడు స్క్రిప్ట్ లో వచ్చే ప్రతీ సీన్ అద్భుతం గా వుంటుంది . ఏ సీన్ ని తీసివేయడానికి కుదరకుండా వుంటుందో అదే బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది .అలా స్క్రిప్ట్ వుండాలంటే  క్రియేట్ చేసే 
సిట్యువేషన్ బాగుండాలి .బలం గా వుండాలి .
                       

ఉదాహరణ : 3 ఇడియట్స్ లో క్లైమాక్స్ (డెలివరీ సీన్)

అమీర్ఖాన్ (రాంచో ) ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో వున్నాడు . అతని స్కిల్ బయటపడాలంటే  ఒక హార్డ్ సీటువేషన్ వుండాలి .రాంచో మేధావితనం ,తెలివితేటలు అంతా బయటపడాలి .లాజిక్ మిస్ అవ్వకూడదు . అందుకే ఇంజినీర్ అయిన రాంచో కి పూర్తి గా వ్యతిరేకమైన మెడికల్ సిట్యువేషన్ క్రియేట్ చేశారు . ఇది వెరీ హార్డ్ సిట్యువేషన్...

---కరీనా కపూర్ (ప్రియా) మెడికల్ స్టూడెంట్ అండ్ డాక్టర్ . తాను వస్తే డెలివేరి చేస్తుంది . అందుకే కరీనా కపూర్ ని హాస్పిటల్ లోకి వెళ్ళేలా చేశారు . వర్షం కురవడం ,వరద రావడం వలన ప్రొఫెసర్ కూతురుని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం కుదరదు . అందుకే లాస్ట్ సీన్ లలో వర్షం ని వాడుతూ వున్నారు ...ఇక్కడ లాజిక్ వుండాలి . అందుకే ఇలా ప్లాన్ చేశారు .

--- రాంచో అతని టీం ఈ డెలివరీ సమస్యని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు . మొదట పవర్ వచ్చేలా చేస్తారు . తర్వాత ఇంటర్నెట్ ద్వారా కరీనా కపూర్ (ప్రియా ) తో మాట్లాడతారు . వాక్యుమ్ క్లీనర్ ద్వారా ప్రెషర్ క్రియేట్ చేసి డెలివరీ చేస్తారు ...

--- అంతకుముందు సీన్ లో ప్రొఫెసర్ సహస్ర బుద్ధి (బొమన్ ఇరానీ ) రాంచో ని కొడతాడు . ఈ సీన్ ద్వారా పూర్తిగా మారిపోవాలి .రాంచో ని బెస్ట్ స్టూడెంట్ గా ఒప్పుకోవాలి ..అదే ఈ సీన్ లో జరుగుతుంది .రాంచో ప్రాక్టికల్ నాలెడ్జి చూసి షాక్ తిని , కూతురుకి పుట్టిన కొడుకు ని చేతుల్లోకి టేసుకోగానే అతని అహం ,సూపర్ ఇగో అంతా ఎగిరిపోతుంది . అందుకే తన పెన్ ఇస్తాడు .


ఇదంతా జరగడానికి సీటువేషన్ కారణం . దీన్ని సరిగ్గా అల్లుకుంటే చాలు . సినిమా నిలబడుతుంది . ఈ సీన్ లో ఒమి వైద్య (చతుర్ ) వుండడు . వుంటే రాంచో మేధావి తనానికి మారిపోతాడు .. అందుకే వుంచలేదు ....( చాలా గొప్ప సీన్ –అందించిన “ రాజ్కుమార్ హీరాణి కి ..అభిజిత్ జోషి కి థాంక్స్ వన్స్ అగైన్ )

Remove the Complexity




స్టోరీ నరేట్  చేసేటప్పుడు ప్రేక్షకులకు  అర్ధం అయ్యేలా చేయాలి. లేకపోతే స్టోరీ అర్ధం గాక ప్రేక్షకులు సినిమా ని ఫ్లాప్ చేస్తారు . ( అది ఎంత గొప్ప ఐడియా అయినా సరే ..)

ఉదాహరణ : గజిని సినిమా కధ

--గజిని సినిమా చాలా కాంప్లెక్స్ గా వున్న కధ .

--కానీ స్టోరీ నరేషన్ లో కొన్ని విషయాలు మాత్రమే దాచి పెట్టి , అన్నీ విషయాలు ఓపెన్ చేశారు .

-- ముందుగా హీరో పరిస్తితి , హీరో మెమొరీ లాస్ సంగతులు అన్నీ క్లియర్ గా చెప్పేసరికి ప్రేక్షకులకు హీరో విషయం అంతా అర్ధం అవుతుంది .

---హీరో కారెక్టర్ తో ప్రేక్షకులు ట్రావెల్ అవ్వడం మొదలు పెడతారు .

---హీరో ఫ్లాష్ బ్యాక్  లో హీరోయిన్ –హీరో ల లవ్ తో ను , హీరోయిన్ కారెక్టర్ తోను కనెక్ట్ అవుతారు . హీరోయిన్ సోషల్ కాస్ లో చనిపోవడం తో ప్రేక్షకులు ఫీల్ అవుతారు .

---హీరో లక్ష్యం విలన్ ని చంపడం ..అది కరెక్ట్ అని ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు ...హీరో కస్టపడి విలన్ ని చంపుతాడు ...

---హీరో తన లక్ష్యం పూర్తి చేసుకున్నాడు ..ప్రేక్షకులు  ఆనందిస్తారు ....

అందుకే సినిమా హిట్ ...

For Repeated Audience:


                                                 

ప్రేక్షకులు హాల్ కి రావాలంటే కధ ,కధనం (స్క్రీన్ ప్లే ) , మాటలు బాగుండాలి ..
ఇవన్నీ బాగుండాలి అంటే స్టోరీ లైన్ కొత్తగా వుండాలి .అప్పుడే స్టోరీ లో కొత్త సీన్ లు , 
కొత్త స్టోరీ రన్ వచ్చే అవకాశం వుంది ...

స్టోరీ లైన్ కొత్తగా వుంటే     ----------------------à కొత్త సీన్ / స్టోరీ రన్  లు వస్తాయి ..

అలరించే కొత్త సీన్ లు/ స్టోరీ రన్  వుంటే ------------------------à ప్రేక్షకులు హాల్ కి మళ్ళీ వస్తారు.

ఉదాహరణ :
---3ఇడియట్స్  ఎందుకు అంత హిట్ అయ్యింది ...? కారణం కొత్త స్టోరీ లైన్ ..కొత్త సీన్ లు ..కొత్త స్టోరీ రన్ ...

---భాగ్ మిల్కా భాగ్ ఎందుకు బాగా ఆడింది ? కారణం కొత్త స్టోరీ లైన్ ..కొత్త సీన్ లు ..కొత్త స్టోరీ రన్ ...


---చెన్నై ఎక్స్ ప్రెస్  ఎందుకు కోట్లు  రప్పించింది .. కారణం కొత్త స్టోరీ లైన్ ..కొత్త సీన్ లు ..కొత్త స్టోరీ రన్ ...

---ఇలా హిట్ అయిన “ గజిని ,పి.కె ,రాంగ్ దే బసన్తి , లగాన్ ,చక్ దే ఇండియా ,కిక్ ,రెడీ ,వాంటెడ్ , జాలీ ఎల్.ఎల్.బి , క్వీన్ , వెడ్నస్ డే 


----ఇలా ఎన్ని కినేమాలు తీసుకున్నా మనం గమనించాల్సింది స్టోరీ లైన్ ను ..స్టోరీ రన్ ను..స్టోరీ సీన్ ను ...అవే ముఖ్యం ....

ఈ కధ నాకు తెలుసు ..ఇలాంటివి చాలా చూశాను అని ప్రేక్షకుడు అనుకోకూడదు .అలా అనుకున్నాడా సినిమా హిట్ కాదు ..ప్రేక్షకుడు మళ్ళీ హాల్ కి రాడు.... 

About Characters -1


Complementary Pairs

రెండు క్యారక్టర్ లు సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ వుంటే , వాటిని చాలా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయాలి . ఆ రెండు క్యారక్టర్ లు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించాలి . ప్రవర్తన , వయస్సు ,మేకప్ , ఆలోచించే తీరు , బాడి లాంగ్వేజ్  ఇలా అన్నింటిలోనూ తేడా వుండాలి . అప్పుడే ఆ రెండు క్యారక్టర్ లు మనకు గుర్తుంది పోతాయి .
ఉదాహరణ : కంపెనీ , సత్యా ,దలపతి , ఇరువర్

--- కంపెనీ సినిమా లో మాలిక్ ( అజయ్ దేవ్ గన్ ) కు చందు ( వివేక్ ఒబెరాయ్ ) కు చాలా తేడా వుంటుంది .

    మాలిక్ –ఆలోచనా పరుడు

      చందు –ఆవేశ పరుడు
మాలిక్ –కూల్ గా రియాక్ట్ అయితే
చందు- సీరియస్ గా రియాక్ట్ అవుతాడు
మాలిక్ –సెన్సిటివ్ కాదు
చందు –సెన్సిటివ్

ఇక్కడే క్యారక్టర్ లు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి . డిఫరెంట్ గా ప్రవర్తిస్తాయి ...


--- సత్యా లో  బికూ మాత్రే  (మనోజ్ బాజ్పేయి) కి సత్యా (జె .డి . చక్రవర్తి  ) కి చాలా డిఫెరెంట్ వుంటుంది.

బికూ మాత్రే --అందరినీ నమ్ముతాడు ..
       సత్యా –ఎవరినీ నమ్మడు .
బికూ మాత్రే –ఆలోచించడు .
సత్యా –బాగా ఆలోచిస్తాడు
బికూ మాత్రే –జోవియల్ గా వుంటాడు ..
సత్యా -- సీరియస్ గా వుంటాడు .


ఇలా రెండు క్యారక్టర్ లు వుండే సినిమా లో క్యారక్టర్ లను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలి . చాలా జాగర్తలు తీసుకోవాలి .

Tripuraneni MahaRadhi gari- Hollywood analysis


Posani's Hollywood film Analysis


Praveen Sattaru - Hollywood Analysis